రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్ధి మృతి

by Naveena |

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బాచుపల్లి లో జరిగింది.

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్ధి మృతి
X

దిశ, కుత్బుల్లాపూర్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బాచుపల్లి లో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం నసూల్ రాబాద్ మండలం బొప్పన్ పల్లి విలేజ్ కు చెందిన కేతావత్ శంకర్ నాయక్, పార్వతి ల చిన్న కుమారుడు కేతావత్ నాను(21) హైదరాబాద్ ప్రగతి నగర్ లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీ టెక్ (సీఎస్ఈ) తృతీయ సంవత్సరం చదువుతూ.. వీఎన్ఆర్ కళాశాల హాస్టల్ లో ఉంటున్నాడు.

తన స్నేహితులు కార్తీక్,విశ్వంత్ లతో కలిసి శనివారం ఉదయం స్కూటీపై బయటికీ వెళ్తున్నాడు. విశ్వంత్ స్కూటి నడుపుతుండగా..కార్తీక్ వెనక కేతావత్ నాను కూర్చున్నాడు. హాస్టల్ గేట్ దాటి కొద్ది దూరం రాగానే బాచుపల్లి రహదారి పై వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న కేతావత్ నాను పై నుండి వాహనం ఢీకొట్టి వెళ్లడంతో.. అతను అక్కడికక్కడే మరణించాడు. మిగతా ఇద్దరు స్నేహితులు విశ్వంత్, కార్తీక్ లకు స్వల్ప గాయాలు అయ్యాయి. కేతావత్ నాను మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించి, గాయపడ్డ మరో ఇద్దరు ఎస్ ఎల్ జీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story