- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ అభివృద్ధి పథకాలను యువత ముందుకు నడిపించాలి
దేశాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్న మహానాయకుడు ప్రధాన మంత్రి నరేందర్ మోడి అని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు.

బీజేపీ అభివృద్ధి పథకాలను యువత ముందుకు నడిపించాలి
ఎంపీ ఈటల రాజేందర్
దిశ, అల్వాల్: దేశాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్న మహానాయకుడు ప్రధాన మంత్రి నరేందర్ మోడి అని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ 135 డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరై పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చేపట్టిన అభివృద్ది కార్యక్రమంలో యువతరం ఉత్సహాంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మోడి 75వ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా కానాజీగూడ పెట్రోల్ పంపు వద్ద రక్త దానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు సేవ పక్షం తరుపున రక్తదానం, కంటీ పరీక్షలు హరితహారం వంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాణిక్యరెడ్డి,మురళికృష్ణ, భాను ప్రకాష్, నిఖిల్, రవికిరణ్,వర్ధన్, ఆంజనేయులు,రఘుపతి రెడ్డి, రాజకుమార్, సుజాత పాల్గొన్నారు.






