రాజిరెడ్డిని పరామర్శించిన బీజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు

by velandi.Saikiran |   (  Updated:2025-10-04 16:21:45  IST  )

తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం 133 డివిజన్ ఉపాధ్యక్షుడు కలచ్చుగారి రాజిరెడ్డిని పరమార్శించారు.

రాజిరెడ్డిని పరామర్శించిన బీజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు
X

దిశ, అల్వాల్: తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం 133 డివిజన్ ఉపాధ్యక్షుడు కలచ్చుగారి రాజిరెడ్డిని పరమార్శించారు. రాజిరెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే హాస్పటల్ నుండి డిచార్జి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాంచందర్ రావు, ఇంటికి వచ్చి అనారోగ్య కారణం తెలుసుకొని పరమార్శించారు. పార్టీ పరంగా అన్నివిధాల అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి,సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, శ్రీనివాస్ వర్మ,మల్లికార్జున్ గౌడ్, గోపి, తూప్రాన్ లక్ష్మణ్, మంద విజయ, వినయ్ పాల్గొన్నారు.

Next Story