- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుషాయిగూడ లో బైక్ దొంగ అరెస్ట్
పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ , కాప్రా: పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుంచి దొంగిలించిన 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఉప్పల్ డిసిపి సురేష్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామానికి చెందిన చిందం రాజు పాత నేరస్తుడు. కాగా కుషాయిగూడ పోలీసులు మంగళవారం చక్రిపురం చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా చిందంరాజు పట్టుబడ్డాడు.
ఈ క్రమంలో తాను నడుపుతున్న వాహనానికి సంబంధించిన పత్రాలను చూపలేదు. అనుమానంతో పోలీసులు విచారణ చేయగా పాత నేరస్తుడు అని తెలిసింది. దీంతో పోలీసులు గట్టిగా బెదిరించగా... చిందం రాజు చోరీచేసిన 14 ద్విచక్ర వాహనాల చిట్టా బయటపడింది. నిందితున్ని చాకచక్యంగా పట్టుకొని చోరీకురైన బైక్లను స్వాధీనం చేసుకున్న కుషాయిగూడ పోలీస్ బృందానికి డీసీపీ సురేష్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఉప్పల్ ఏసిపి వెంకట్ రెడ్డి, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎల్ భాస్కర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
- Tags
- Bike
- Kushaiguda






