- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలి
ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. తార్నాకలోని ప్రధాన కార్యక్రమంలో శుక్రవారం ఎంఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జయేష్ రంజన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 30 అజెండా అంశాలపై చర్చించారు. ప్రజా సేవల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు, క్రీడల మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ.. వర్షకాలం లోపు రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలన్నారు.పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఆయాశాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, జోనల్ కమిషనర్లు రాధికా గుప్తా, సంచిత్ గంగ్వార్‌తో పాటు పారిశుధ్య అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, పరిపాలన అదనపు కమిషనర్ వేణుగోపాల్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.






