- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
మీర్ పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ లో వరదముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. శనివారం స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, స్థానిక కాలనీవాసులతో కలిసి లక్ష్మీ నగర్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు.

వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలి
హెచ్ బీ కాలనీ, లక్ష్మీ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే బండారి
వరద ముంపు ప్రాంతాల పర్యవేక్షణ
దిశ , కాప్రా: మీర్ పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ లో వరదముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. శనివారం స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, స్థానిక కాలనీవాసులతో కలిసి లక్ష్మీ నగర్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. గత ఐదు రోజులుగా కురిసిన వర్షాలతో... పైనుంచి వస్తున్న వరద తో లక్ష్మి నగర్ కాలనీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దానికి తోడు కాలువల్లో వ్యర్ధాలు నిండిపోవడంతో మాన్యువల్ నుంచి మురుగు పొంగుతూ నివాసాల మధ్య పారుతున్నాయి. కారణంగా భరించలేని దుర్వాసన పరిసరాలను అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మురుగు కాలువల్లో నిండిపోయిన చెత్తాచెదారం వ్యర్ధాలను వెంటనే తొలగించాలని జలమండలి అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఇక పైనుంచి వచ్చే వరద దిగివకు వెళ్లేలా... చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధిక వర్షాలు ఉన్నప్పుడు కాలనీవాసులు రాకపోకల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.






