సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

by Elthuri vijay kumar |

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ లో బతుకమ్మ పండుగ నిలుస్తుందని సెరినిటి పాఠశాల ముఖ్య కార్యదర్శి నోముల వసంత అన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
X

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

పాఠశాల ముఖ్య కార్యదర్శి నోముల వసంత

దిశ, నాగారం : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ లో బతుకమ్మ పండుగ నిలుస్తుందని సెరినిటి పాఠశాల ముఖ్య కార్యదర్శి నోముల వసంత అన్నారు. నాగారం మున్సిపాలిటీలోని సెరినిటి పాఠశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని అన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులను బతుకమ్మ ఆట పాటలతో ఆడి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో తల్లి దండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story