ప్రజా ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్ద పీట

by velandi.Saikiran |

ప్రజా ఆరోగ్యానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్​ అన్నారు. బాలానగర్​ డివిజన్​

ప్రజా ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్ద పీట
X

దిశ, కూకట్​పల్లి: ప్రజా ఆరోగ్యానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్​ అన్నారు. బాలానగర్​ డివిజన్​ సాయినగర్​కు చెందిన పాలడుగు వెంకటకృష్ణ గత కొంత కాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధ పడుతు వైద్యం కోసం ఆర్థిక పరిస్థితి సహకరించక ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ తెలుసుకున్న బండి రమేష్, ​ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 8.80 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేల చర్యలు తీసుకున్నారు.

శనివారం చెక్కును వెంకటకృష్ణ నివాసానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్​ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రజా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి చందు, సిద్దు, లక్ష్మణ్, పుష్ప రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, యుగేందర్ రెడ్డి, పులి శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, శ్రీనివాస్ గౌడ్, మధు, రామ్మోహన్​ రావు, భరత్, నరేందర్, మహేందర్, రేణుక, సాయి భారతి తదితరులు పాల్గొన్నారు.

Next Story