- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి అవగాహన.. 300 మంది హాజరు
ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలకు సైబరాబాద్ పోలీసులు శనివారం అవగాహన, సున్నితీకరణ సమావేశాన్ని నిర్వహించారు.

దిశ, మేడ్చల్: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ విక్రేతలకు సైబరాబాద్ పోలీసులు శనివారం అవగాహన, సున్నితీకరణ సమావేశాన్ని నిర్వహించారు. మేడ్చల్ మండలం కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యారు. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, సీసీటీవీ విక్రేతల పాత్ర కీలకమని అన్నారు. పోలీసులకు సహకరిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ చట్టం (పీఎస్‌ఏఆర్‌ఏ)-2005 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, భద్రతా అంశాలపై అవగాహన కల్పించడం, ప్రజల రక్షణలో అప్రమత్తత పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగిరెడ్డి, కుత్బుల్లాపూర్ జోన్‌కు చెందిన సీఐలు పాల్గొన్నారు.






