- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగల హల్చల్..బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నం
ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలుడిని అపహరించడానికి యత్నించి.. విఫలమైన సంఘటన నాచారం పోలీస్

దిశ, నాచారం : ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలుడిని అపహరించడానికి యత్నించి.. విఫలమైన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ నరసింహనగర్ చెందిన దినేష్, కవిత దంపతులు అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పనిచేస్తుంటారు. వీరికి ముగ్గురు పిల్లలు. రెండో బాబు చిన్నా (4). నరసింహ నగర్ ఝాన్సీ స్కూల్ సమీపంలో నూతన నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద శనివారం రాత్రి చిన్నా (4) బాలుడు ఆడుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ముగ్గురు యువకులు చిన్నాను అపహరించారు.
ఈ క్రమంలో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన అంజన టవర్స్ చెందిన అచ్యుత్, దొంగలను పసిగట్టి చిన్నాను కాపాడాడు. అచ్యుత్ గట్టిగా ప్రశ్నించడంతో పిల్లాడిని వదిలివేసిన దొంగలు, అక్కడి నుంచి పారిపోయారు. కాగా గత నాలుగు రోజుల క్రితం తిరుమల అపార్ట్మెంట్ వాచ్మెన్ దంపతుల బాబును, దుండగులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారట. అయితే, ఆ అపార్ట్మెంట్ కు చెందిన ఓ మహిళ గుర్తించి బాలుడిని రక్షించింది. దీంతో మల్లాపూర్ ప్రాంతంలో నిఘా పెంచచాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నారులు, మహిళల రక్షణ, భద్రత కోసం పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కాలనీ సంఘాలు కోరుతున్నారు.






