- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోడుప్పల్ లో యువకుకుల పై బ్లేడ్‌తో దాడి..!
యువకులపై బ్లేడ్ తో దాడి జరిగిన సంఘటన బోడుప్పల్ లో చోటు చేసుకుంది.

దిశ, మేడిపల్లి : యువకులపై బ్లేడ్ తో దాడి జరిగిన సంఘటన బోడుప్పల్ లో చోటు చేసుకుంది. స్థానికులు, మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్ కు చెందిన మండల సాయికుమార్ (26), అతని స్నేహితులు వాసు (23), రాహుల్ (22)తో కలిసి కట్టమైసమ్మ వైన్స్ లో మద్యం సేవించి బయటికీ వచ్చారు. ఇదే సమయంలో చిలుకానగర్ వైపు నుంచి బైకు పై వచ్చిన జాన్, పవన్ తో పాటు మరికొందరూ సాయికుమార్ ను అడ్డగించి.. పాత కక్షల కారణంగా వాగ్వాదానికి దిగారు.
దీంతో మాటామాటా పెరగడంతో సాయి కుమార్ ప్రశ్నించగా... జాన్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్‌ను తీసి సాయి కుమార్ మెడపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సాయి కుమార్ మెడకు తీవ్ర గాయమై రక్తస్రావం కాగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికులు, స్నేహితులు కలిసి బోడుప్పల్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. దాడికి పాల్పడిన పవన్, మెడపై గాయమైన బాధితుడు సాయి కుమార్ ఇద్దరు బోడుప్పల్ ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన వారే. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.






