- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీవాలను వేధిస్తన్న లంపీస్కిన్
ఘట్కేసర్ మండల పరిధిలో పశువులను లంపీస్కిన్ వైరస్ పట్టి పీడిస్తోంది. ఏడాది క్రితం సోకిన ఈ వైరస్‌తో ఆవులు, లేగ దూడలు ఇంకా బాధపడుతూనే ఉన్నాయి. వైరస్ తో శరీరంపై ఏర్పడిన కణతులు,

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ మండల పరిధిలో పశువులను లంపీస్కిన్ వైరస్ పట్టి పీడిస్తోంది. ఏడాది క్రితం సోకిన ఈ వైరస్‌తో ఆవులు, లేగ దూడలు ఇంకా బాధపడుతూనే ఉన్నాయి. వైరస్ తో శరీరంపై ఏర్పడిన కణతులు, గాయాలు మానడం లేదు. పుండ్లు ఏర్పడి రక్తస్రావమవుతోంది. గాయాలు మానడం కోసం వేలకు వేల మందులు ఖర్చు చేసినా తగ్గడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
లంపీస్కిన్ వైరస్ బారిన పడిన ఆవులు బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే ఇతర జీవాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. వైరస్ సోకిన పశువులను గుర్తించి వాటికి చికిత్సలు చేయించాలని వైద్యులు కోరుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన పశువులు ఈగలు, దోమలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే వాటిని చూసిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
చికిత్సకు రూ.15వేలు ఖర్చు చేశా...
- మేడబోయిన సంజీవ, పాడి రైతు
ఆవు 6నెలలు దూడగా ఉన్నప్పుడు లంపీస్కిన్ వైరస్ సోకింది. ఇప్పుడు ఆవుకి సంవత్సరన్నర. వైరస్ సోకినప్పుడు వచ్చిన కణతులు, గాయాలు ఇంకా మానలేదు. రక్తస్రావం జరిగి ఈగలు ముసురుతున్నాయి. ఆవు పరిస్థితి చూస్తే బాధ కలుగుతోంది. పశు వైద్యాధికారులు లంపీ స్కిన్ వైరస్ తో ఏర్పడ్డ గాయాలు పూర్తిగా మానేలా చర్యలు చేపట్టాలి.
నివారణ చికిత్సలు చేపట్టాం...
- పద్మిని, మండల పశువైద్యాధికారి
లంపీస్కిన్ వైరస్ సోకిన అన్ని పశువులకు చికిత్స చర్యలు చేపట్టాం. వ్యాధి ఉన్న ఆవు దూడలకు వ్యాక్సిన్ ఇచ్చాము. మరికొన్ని పశువులకు సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేశాం. ఈ వ్యాధి దూడలకు మాత్రమే సోకుతుంది. వాటిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున ఈ వ్యాధి వాటికి మాత్రమే సోకే అవకాశాలు ఉన్నాయి. లంపీస్కిన్ వైరస్ వల్ల ఏర్పడిన గాయాలు నెమ్మదిగా మానిపోతాయి. రైతులు, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.






