కేపీహెచ్​బీలో అన్ని అక్రమ నిర్మాణాలే..!

by Chintha Aamani |

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నివాసం ఉంటున్న మినీ ఇండియాగా పేరుగాంచిన కూకట్​పల్లిలో సొంతిల్లు తీసుకుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది.

కేపీహెచ్​బీలో అన్ని అక్రమ నిర్మాణాలే..!
X

దిశ,కూకట్పల్లి: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నివాసం ఉంటున్న మినీ ఇండియాగా పేరుగాంచిన కూకట్​పల్లిలో సొంతిల్లు తీసుకుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. హైటెక్​సిటీకి కూతవేటు దూరంలో ఉండటం, అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు కూకట్​పల్లి ప్రాంతంలో ఉండటంతో లక్షలాది మంది తమ నివాసం కోసం కూకట్​పల్లి ప్రాంతాన్ని ఎంచుకుంటు ఉంటారు. సరిగ్గా ఈ కలనే టార్గెట్​గా చేసుకున్న కొంత మంది మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్​గా చేసుకుని తమ రియల్​ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. అపార్ట్​మెంట్​లో ఫ్లాట్​ల డిమాండ్​ ఉండటంతో చిన్నపాటి స్థలంలో అక్రమంగా అదనపు అంతస్థులు నిర్మిస్తు మధ్య తరగతి కుటుంబాలను, చిరు ఉద్యోగులను నమ్మించి మోసం చేస్తు తమ వ్యాపారాన్ని చేపడుతున్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని అత్యంత ఖరీదైన ప్రాంతం కేపీహెచ్​బీకాలనీ. ఇక్కడ పేద, మధ్య తరతగతికి చెందిన ప్రజల నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ తారలు సైతం నివాసం ఉండే కాలనీలు ఉన్నాయి.

అక్రమ నిర్మాణాలే..

కేపీహెచ్​బీకాలనీలో ఫేజ్​ 1 నుంచి 15, గోకుల్​ ప్లాట్స్​, భగత్​సింగ్​ నగర్​, సర్దార్​పటేల్​ నగర్​, వసంత్​నగర్​ కాలనీ, ఎన్​ఆర్​ఎస్​ఏ కాలనీలో ఎక్కడ పడితే అక్కడ బిల్డర్లు తీసుకున్న అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతు జీహెచ్ఎంసీ, ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్నారు. కేపీహెచ్​బీ కాలనీ లో ప్రధానంగా 15 ఫేజ్​, 9వ ఫేజ్​, గోపాల్​ నగర్​, భగత్​సింగ్​ నగర్​, ఎంఐజి1,2, ఎల్​ఐజి, హెచ్​ఐజి కాలనీలలో నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్మాణాలు చేపడుతు బిల్డర్లు జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగానికి సవాల్​ విసురుతున్నారు.

అధికారుల తీరు ప్రశ్నార్థకం..

మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణ చోటు చేసుకుంటుంటే వాటిని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇద్దరు డీసీలు మారారు, గతంలో ఉన్న డీసీ అక్రమ నిర్మాణాలను యధేచ్చగా ప్రోత్సాహించి తనకు రావలసిన కాసులను దండుకుని సైలెంట్​గా ఉండటం తో అక్రమ నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరిగిందనే ఆరోపణలు ఎక్కవగా వినిపిస్తున్నాయి. కొత్తగా ఛార్జ్ తీసుకున్న డీసీ ప్రస్తుతం సర్కిల్​ పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే సమయం దొరకడం లేదు. దానికి తోడు టౌన్​ప్లానింగ్​ విభాగంలో అధికారులు పూర్తి స్థాయిలో లేకపోవడం, ఒక ఏసీపీ, ఒక టీపిఎస్​తో పెద్ద సర్కిల్​లో పట్టణ ప్రణాళిక విభాగాన్ని నడిపించడం సాధ్యం కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల లేమి అక్రమ నిర్మాణలు చేపడుతున్న బిల్డర్ల పాలిట వరంగా మారిందనే చెప్పవచ్చు.

Next Story