- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్‌కు సర్వం సిద్ధం
మే 3న జరగనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు.

X
దిశ, మేడ్చల్ బ్యూరో : మే 3న జరగనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 3,468 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు చివరి నిమిషంలో కంగారు పడకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్‌టికెట్‌లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వేసవి దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం మెడికల్ కిట్లు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని వైద్యశాఖను, దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో చంద్రావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Next Story






