ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: మేడ్చల్ అదనపు కలెక్టర్

by Hajipasha |   (  Updated:2023-01-30 12:14:51  IST  )

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి: మేడ్చల్ అదనపు కలెక్టర్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్‌తో కలిసి అదనపు కలెక్టర్ ప్రజల నుంచి 65 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేసేందుకు ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి వస్తుంటారని, అలాంటి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story