- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంఎంసీలో నీటి నిల్వలు లేకుండా చర్యలు
వర్షా కాలన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : వర్షా కాలన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాగోల్, నేతాజీ నగర్, శృంగేరి కాలనీ, ఈస్ట్ యాదవ్ నగర్ ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నాగోల్ బ్రిడ్జి సమీపంలోని మూసీ నదిని పరిశీలించిన కమిషనర్ నదిలో లార్వా సాంద్రతను తనిఖీ చేయగా సున్నాగా నమోదైనట్లు తెలిపారు. దోమల నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈస్ట్ యాదవ్ నగర్‌లోని వరద నీటి కాలువలను పరిశీలించి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. శృంగేరి కాలనీలో తొలగించిన జీవీపీ ప్రాంతాన్ని కమిషనర్ సందర్శించి ఆక్రమణలను పూర్తిగా తొలగించి ప్రాంతాన్ని శుభ్రంగా నిర్వహించిన సిబ్బంది పనితీరును ప్రశంసించారు.నేతాజీ నగర్‌లోని సైతం వరద నీటి కాలువలను పరిశీలించిన కమిషనర్ రహదారి పక్కన పేరుకుపోయిన మురుగు మరియు చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు.






