Pet Basheerabad :కొంపల్లి కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి.. చిన్నారుల వినూత్న ఫిర్యాదు

by Chintha Aamani |

రేవంత్ అంకుల్.. కమిషనర్ అంకుల్.. వివేక్ అంకుల్ మమ్మల్ని

Pet Basheerabad :కొంపల్లి కమిషనర్‌పై  చర్యలు తీసుకోవాలి.. చిన్నారుల వినూత్న  ఫిర్యాదు
X

దిశ,పేట్ బషీరాబాద్: రేవంత్ అంకుల్.. కమిషనర్ అంకుల్.. వివేక్ అంకుల్ మమ్మల్ని కుక్కల నుంచి కాపాడండి అంటూ కార్డుల తో ప్రదర్శనగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు చిన్నారులు. కొంపల్లి మున్సిపాలిటీ ఎన్సీఎల్ కాలనీలో తరచుగా వీధి కుక్కల దాడులు చేయడం వల్ల పలువురు తీవ్ర గాయాలు అవటమే కాకుండా మరికొందరు అవయవాలు సైతం కోల్పోయారని ఈ అంశంపై అనేకమార్లు కొంపల్లి మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తూ ఎన్సీఎల్ కాలనీవాసులు ఆ కాలనీ చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొంపల్లి కమిషనర్ శ్రీహరి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కాలనీలో 75 మంది కుక్క దాడులలో బాధితులుగా ఉన్నారని, రెండు రోజుల క్రితమే వీధి కుక్కలు మరొకసారి రెచ్చిపోయి గాయపరిచాయని వాపోయారు.

Next Story