వ‌ర‌ల్డ్ క‌ప్ ఇర‌గ‌దీసిన ఆరోన్ జార్జ్..సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు

by velandi.Saikiran |

ఆరోన్ జార్జ్ తండ్రి ఈసో వర్గీస్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఎస్‌.ఐగా 13 సంవత్సరాలు సేవలందించి అనంతరం రాజీనామా చేశారు.

వ‌ర‌ల్డ్ క‌ప్ ఇర‌గ‌దీసిన ఆరోన్ జార్జ్..సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు
X

దిశ, నాచారం : ప్రపంచ కప్–19లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన యువ క్రికెటర్ ఆరోన్ జార్జ్ విజయం పట్ల ఆయన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ గెలుపు సందర్భంగా ఆరోన్ జార్జ్ తల్లిదండ్రులు ఈసో వర్గీస్, ప్రీతి వర్గీస్ మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.

ఆరోన్ జార్జ్ తండ్రి ఈసో వర్గీస్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఎస్‌.ఐగా 13 సంవత్సరాలు సేవలందించి అనంతరం రాజీనామా చేశారు. తల్లి ప్రీతి వర్గీస్ గృహిణి. ఈసో వర్గీస్‌కు క్రికెట్‌పై ప్రత్యేకమైన మక్కువ ఉండటంతో లీగ్ మ్యాచ్‌ల వరకు ఆడిన అనుభవం ఉంది.

ఆరోన్ జార్జ్ నాలుగేళ్ల వయసులోనే అతని ప్రతిభను గుర్తించిన తండ్రి, క్రికెట్ శిక్షణకు ప్రోత్సహించారు. సుభాష్ చందర్, బీజు నాయర్, మాజీ క్రికెటర్, అంతర్జాతీయ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ పర్యవేక్షణలో ఆరోన్ జార్జ్ శిక్షణ పొందారు. ఈ కృషి ఫలితంగానే నేడు ప్రపంచ వేదికపై భారత జట్టుకు గర్వకారణంగా నిలిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story