- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, మేడ్చల్ టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ఏడు గంటలకు మేడ్చల్ పట్టణంలోని బస్‌డిపో ముందు మహిళ రోడ్డు దాటుతుంది. అదే సమయంలో మేడ్చల్ నుండి ఓఆర్ఆర్ వైపు వెళ్తున్న లారీ మహిళను ఢీ కొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన మహిళ రాగ జ్యోతి(32) పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు
Next Story






