మేడ్చల్ కు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మంత్రికి వినతి

by Ratna Kumari |

మేడ్చల్ ప్రాంతంలో విద్యాభివృద్ధికి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రమేష్ జిల్లా ఇన్ చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు వినతి పత్రం సమర్పించారు.

మేడ్చల్ కు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మంత్రికి వినతి
X

దిశ, మేడ్చల్ : మేడ్చల్ ప్రాంతంలో విద్యాభివృద్ధికి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రమేష్ జిల్లా ఇన్ చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు వినతి పత్రం సమర్పించారు. మేడ్చల్ ప్రాంతంలో డిగ్రీ కళాశాల లేని కారణంగా స్థానికంగా ఉన్న పేద విద్యార్థులు ఇంటర్ తర్వాత విద్యను ఆపివేస్తున్నారన్నారు. ప్రధానంగా విద్యార్థినులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారని తెలిపారు. ఎంతో కాలంగా మేడ్చల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ విద్యార్థులను నుంచి వ్యక్తం అవుతున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.

డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కొత్తగా స్థలం కేటాయింపు కూడా అవసరం లేదని, ఏడెకరాల్లో ఉన్న జూనియర్ కళాశాలలోనే ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ విషయాలను పరిశీలించి, మేడ్చల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కళాశాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో గిర్మాపూర్ మాజీ ఉపసర్పంచ్ రఘుపతి రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story