- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండ్లపోచంపల్లిలో రూ.కోట్ల విలువైన భూమిపై కన్నేసిన ఓ రాజకీయ నేత
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, మేడ్చల్ బ్యూరో : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో భూవివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నంబర్ 721లో ఉన్న సుమారు 10 ఎకరాల భూమి విషయంలో అక్రమ జోక్యం, బెదిరింపుల ఆరోపణలతో పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సర్వే నెంబర్ 721లోని 10 ఎకరాల భూమి సికింద్రాబాద్‌కు చెందిన మణికందన్ అనే వ్యక్తి పేరిట ఉంది. ఈ భూమికి సంబంధించిన లొకేషన్ స్కెచ్‌లు, రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, ప్రభుత్వ సర్వే రికార్డులు అన్నీ మణికందన్ అనే వ్యక్తి ఆధీనంలో ఉన్నట్లు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
అయితే, డొడ్ల మల్లికార్జున్ అనే వ్యక్తి భూమిలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడని మణికందన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. డొడ్ల మల్లికార్జున్ గతంలో బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా పనిచేసి, ప్రస్తుతం బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని సమాచారం. రాజకీయ అండదండలున్నాయనే ధీమాతో భూమిని లాక్కోవడానికి ప్రయత్నించడం, డబ్బులు డిమాండ్ చేయడం, అలాగే ఆయుధాలతో వచ్చి ప్రాణహాని ఉందని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
భూమికి సంబంధించి..
2012 సంవత్సరంలో 10 ఎకరాల భూమి కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని, వ్యవసాయ భూమిని నాన్-అగ్రికల్చర్‌గా మార్పిడి చేసినట్లు ఫిర్యాదుదారు మణికందన్ తెలిపారు. 2023లో అధికారిక ప్రభుత్వ సర్వే కూడా నిర్వహించినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.






