- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలి
బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైయ్యింది. ఓ అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కోని ఆర్ఎంపి డాక్టర్ మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, దుండిగల్ : బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైయ్యింది. ఓ అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కోని ఆర్ఎంపి డాక్టర్ మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ అక్బర్ పాటిల్ (39) సూరారం కృష్ణానగర్ లో ఓ అపార్ట్మెంట్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం మధ్యాన్నం అపార్ట్మెంట్ కారిడార్ లో పిల్లలు ఆడుకుంటుండగా.. బాల్ లిఫ్ట్ లో పడింది,బాల్ తీసే ప్రయత్నం చేయగా అదే సమయంలో లిఫ్ట్ మూవ్ కావడంతో లిఫ్ట్ అతని తలపై పడి అక్కడికి అక్కడే మృతిచెందాడు. అనంతరం సమాచారం అందుకున్న పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. బిల్డర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా?ఉద్దేశం పూర్వకంగా జరిగిందా ?అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






