- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, పేట్ బషీరాబాద్: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఫేస్ 3 లో కోపల్లి ఫార్మా కెమికల్స్ కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ ప్రాంగణంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఒకసారి గా పెద్ద పెద్ద పేలుళ్లతో మంటలు వ్యాపించాయి. అయితే ప్రస్తుతానికి మూతపడ్డ పరిశ్రమలోని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది, డిజాస్టర్ అత్యవసర సిబ్బంది, జీడిమెట్ల పోలీసులు మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. కెమికల్ డ్రమ్ములు పెద్ద పెద్ద శబ్దాలతో పేలుతుండటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కాగా మూతపడ్డ పరిశ్రమంలోని ప్రమాదం జరిగిందని, ప్రమాదం ఏ విధంగా జరిగింది..? ఎంత ఆస్తి నష్టం సంబంధించినది..? ప్రమాద సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా..? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






