ఎంపీ ఈటల రాజేందర్ కు వినతి పత్రం

by velandi.Saikiran |

మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ కు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి,చిన్న తోకట్టా లోని జిఎం అంజయ్య

ఎంపీ ఈటల రాజేందర్ కు వినతి పత్రం
X

దిశ, తిరుమలగిరి: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో హిందు స్మశాన వాటికల అభివృద్ధికి సహకరించాలని మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ కు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి,చిన్న తోకట్టా లోని జిఎం అంజయ్య స్మారక హిందు స్మశాన వాటిక కమిటీ అధ్యక్షుడు ఎ కొండల్ యాదవ్,ప్రధాన కార్యదర్శి ఎ విజయ్ బాబు లు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న తోకట్టా లోని జిఎం అంజయ్య స్మారక హిందు శ్మశానవాటిక, ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్ లోని హిందు శ్మశానవాటిక సంఘం శ్మశానవాటిక అభివృద్ధి కోసం ఎంపి లాడ్స్ నిధుల నుండి నిధులు మంజూరు చేయాలని ఎంపిని కోరారు.

హిందు స్మశాన వాటికలలో దహన వేదికల నిర్మాణం,వాచ్‌మన్ గది,మహిళల విశ్రాంతి గది,అస్థికలు బద్రపరిచే గదులు,అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రహదారులు,విద్యుత్ దీపాల ఏర్పాటు,ల్యాండ్‌ స్కేపింగ్ పనులు అభివృద్ధి చేయాలని కోరారు.ఎంపి కి వినతిపత్రం అందజేసిన వారిలో సంయుక్త కార్యదర్శి రామారావు,కోశాధికారి టి ముఖేష్ యాదవ్,సలహాదారులు జిఎస్ యాదవ రావు,అశోక్ కుమార్ ముదిరాజ్,వర్ధరాణి,కేర్‌టేకర్ ఎం సురేందర్,కార్యనిర్వాహక సభ్యులు కాంత్రాజ్,ఎల్లాంగో రాజ్,చంద్ర మోహన్,అవినాశ్, సుధాకర్,నరేష్,విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Next Story