- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో గొడవ..గొడ్డలితో దాడి
గుండ్లపోచంపల్లి సర్కిల్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో మంగళవారం రాత్రి హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, మేడ్చల్ టౌన్: గుండ్లపోచంపల్లి సర్కిల్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో మంగళవారం రాత్రి హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గౌడవెల్లిలోని హనుమాన్ ఆలయం సమీపంలో నివసిస్తున్న గోమారం లక్ష్మారెడ్డి (42), వృత్తిరీత్యా పెయింటర్, తలపై తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, మృతుడు లక్ష్మారెడ్డి తన ఇంట్లో అద్దెకుంటున్న మలిగ లింగం (50), వృత్తిరీత్యా గొర్రెల కాపరితో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసినట్లు తెలిపారు. గొడవ తీవ్రత పెరగడంతో నిందితుడు మలిగ లింగం గొడ్డలితో లక్ష్మారెడ్డి తలపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
- Tags
- crime
- gowdavelli






