వేతనాలు పెంచాలి.. కలెక్టరేట్ ప్రజావాణికి 95 దరఖాస్తులు

by Kodari Anjali |

ఈ.ఎస్.ఐ, పీ.ఎఫ్ వర్తింపజేయాలని అదనపు కలెక్టర్ ను వేడుకున్న కలెక్టరేట్ హౌస్ కీపింగ్ సిబ్బంది వేడుకున్నారు.

వేతనాలు పెంచాలి.. కలెక్టరేట్ ప్రజావాణికి 95 దరఖాస్తులు
X

మేడ్చల్, బ్యూరో: వేతనం పెంచడంతో పాటు మాకు ఈ.ఎస్. ఐ, పీ.ఎఫ్ వర్తింపజేయాలని కలెక్టరేట్ కార్యాలయ హౌస్ కీపింగ్ మహిళా సిబ్బంది జిల్లా కలెక్టర్ ను కోరారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము గత పదేళ్లుగా కలెక్టరేట్ లో వాత్సల్య ఏజెన్సీ ఆధ్వర్యంలో, కలెక్టరేట్ హౌస్ కీపింగ్ పనులు నిర్వహిస్తున్నామని, అయితే సదరు సంస్థ పదేళ్ల నుంచి తమకు నెలకు రూ. 6 వేలు మాత్రమే వేతనంగా చెల్లిస్తూ వచ్చిందన్నారు. కాగా రెండేళ్ల నుంచి మాత్రం పది వేల రూపాయాలు వేతనాలు చెల్లిస్తున్నదని, అయితే ఈ.ఎస్.ఐ, పీ.ఎఫ్ సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో హౌస్ కీపింగ్ సిబ్బందికి నెలకు రూ.22 వేల చొప్పున వేతనం చెల్లిస్తూ, ఈ.ఎస్.ఐ, పీ.ఎఫ్ వర్తింప జేస్తున్నారనీ, ఇక్కడ మేడ్చల్ జిల్లాలో మాత్రం వాత్సల్య ఏజెన్సీ రూ. 10 వేలు మాత్రమే చెల్లించడం వల్ల మా కుటుంబాలు గడవడం కష్టంగా ఉందన్నారు.

ప్రజావాణికి 95 ఆర్జీలు..

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి డిఆర్ఓ మాలతితో కలిసి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి 95 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు.

Next Story