14.7 కిలోల పప్పి స్ట్రా డ్రగ్స్ స్వాధీనం

by velandi.Saikiran |

పప్పి స్ట్రా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించిన సంఘటన

14.7 కిలోల పప్పి స్ట్రా డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, నాచారం: పప్పి స్ట్రా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారం ఎస్. ఐ మైబెల్లి ఎస్‌.ఐ. ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేప‌ట్టారు. ఈ త‌రుణంలోనే నాచారం చౌరస్తా చిల్కానగర్ మార్గం వద్ద మోటార్‌సైకిల్‌పై పప్పి స్ట్రా బ్యాగ్‌తో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని రాజస్థాన్ బార్మన్ జిల్లాకు చెందిన రమేష్ కుమార్ (30), సురేష్ కుమార్, తండ్రి: జయ్ రామ్ (26) చెంగిచెర్ల నివాసులుగా గుర్తించారు.

వీరు రైలింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారి వద్ద 14.7 కిలోల పప్పి స్ట్రా డ్రగ్స్ , రెండు ఫోన్లు, బజాజ్ పుల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రమేష్ కుమార్, మంగళ్ రామ్ అనే వ్యక్తి ద్వారా పప్పి స్ట్రా డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు విక్రయించే వాడని, సురేష్ కుమార్ రవాణా పంపిణీలో సహకరించేవాడని ఎస్ఐ తెలిపారు. నిందితులను ఇద్దరినీ రిమాండ్ కు తరలించారు. అక్రమ నార్కోటిక్స్ పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story