- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
108 అంబులెన్స్ లో ప్రసవం.. తల్లి, శిశువు క్షేమం
by Taduka Kalyani |
నిండు గర్భిణీని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ లోనే మహిళ ప్రసవించిన సంఘటన సుభాష్ నగర్ లో చోటుచేసుకోంది.

X
దిశ, పేట్ బషీరాబాద్: నిండు గర్భిణీని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ లోనే మహిళ ప్రసవించిన సంఘటన సుభాష్ నగర్ లో చోటుచేసుకోంది. వివరాల్లోకి వెళ్లితే.. లలితాదేవి నిండు గర్భిణీ. సోమవారం అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. సమయానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది సదరు మహిళను షాపూర్ నగర్ లో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు మహిళను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువ అవడంతో సిబ్బంది అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. పుట్టిన శిశువుతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉందని ఈఎంటీ నరేష్, పైలెట్ శ్రీనివాస్ లు తెలిపారు.
Next Story






