- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శరవేగంగా మేడారం పనులు
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనుల వేగం పెంచింది.

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనుల వేగం పెంచింది. జాతరకు ఇప్పటి నుంచే భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం జాతర ప్రాంతాన్ని 8 జోన్‌లు, 47 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు ఒక అధికారితో పాటు ఎనిమిది మంది సిబ్బందిని నియమించారు. ఈ అధికారులు జనవరి 1 నుంచే విధుల్లో చేరాలని కలెక్టర్ దివాకర ఆదేశాలు జారీ చేసారు. జాతర ముగిసే వరకు స్థానికంగానే ఉంటూ టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, రోడ్ల పనులు, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ప్రదేశాలు వంటి ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
భక్తులతో సంబంధం ఉన్న 24 ప్రభుత్వ శాఖల అధికారులను కూడా కలెక్టర్ అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, అధికారులకు రెండు రోజుల పాటు మేడారంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.






