- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డెక్కిన మేడారం ఆలయ పూజారులు.. కారణం ఇదే!
by Gantepaka Srikanth |
మేడారం సమ్కక్క-సారలమ్మ ఆలయ పూజారులు రోడ్డెక్కారు. బుధవారం మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలతో ఆలయం ఎదుట నిరసన తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మేడారం సమ్కక్క-సారలమ్మ ఆలయ పూజారులు రోడ్డెక్కారు. బుధవారం మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలతో ఆలయం ఎదుట నిరసన తెలిపారు. వరంగల్ పట్టణంలోని ధార్మిక భవనాన్ని ఆలయానికి కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా 1014 గజాల స్థలాన్ని మేడారం ఆలయ సౌకర్యాల నిమిత్తం 1993 సంవత్సరంలో దేవాదాయ శాఖ మేడారానికి కేటాయించింది. ఆ భూమిలో ఏర్పాటు చేసిన ధార్మిక భవనాన్ని భద్రకాళి ఆలయ అర్చకులు, అధికారులు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు దక్కకుండా వేద పాఠశాల పేరుతో దక్కించుకుంటున్నారని మేడారం పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేకు, మంత్రులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇవాళ ఆందోళనకు దిగారు.
Next Story






