Medals: స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా పతకాలు.. తెలంగాణకు ఎన్నంటే?

by Prasad Jukanti |

ఉత్తమ సేవలు అందించిన అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పతాకలను ప్రకటించింది.

Medals:  స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా పతకాలు.. తెలంగాణకు ఎన్నంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఉత్తమ సేవలు అందించిన అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పతాకలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, 2 ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఏఎస్ఐ సిద్ధయ్య, నిడమానురి హుస్సేన్ ప్రెసిడెంట్ మెడల్స్ కు ఎంపిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు 2 ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి. దేశవ్యాప్తంగా మొత్తం 233 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 758 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించారు. ఏటా స్వాతంత్య్రం దినోత్సవం నాడు ఉత్తమంగా పనిచేసే అధికారులకు కేంద్రం అవార్డులు అందించడం ఆనవాయితీ.

Next Story