యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : ఎస్సై వివేక్

by Ratna Kumari |

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలనే సంకల్పంతో నంగునూరు మండలం గట్లమల్యాలలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ 5కే రన్ ఉత్సాహంగా సాగింది.

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : ఎస్సై వివేక్
X

దిశ, నంగునూరు : యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలనే సంకల్పంతో నంగునూరు మండలం గట్లమల్యాలలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అండ్ హెల్త్ అవేర్‌నెస్ 5కే రన్ ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన వంటేల గోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య వంటేల లక్ష్మి , కుమారుడు జీవన్ రెడ్డి నిర్వహించారు. ముఖ్య అధితులుగా విచ్చేసిన రాజగోపాలపేట ఎస్సై టి. వివేక్ జెండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ మత్తు కాదు - జీవితం కావాలి అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత గ్రామాలు, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచిన దండ్ల మల్లేశం ప్రథమ స్థానంలో నిలవగా, బానోతు రోహిత్ ద్వితీయ స్థానాన్ని, దండ్ల చందు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేతలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్, ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్, వార్డు సభ్యులు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది బిందు, ఆశావ‌ర్క‌ర్లు పాల్గొన్నారు.

Next Story