- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత గాంధీజీ కలలను సాకారం చేయాలి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యువత సృజనాత్మకత శక్తితో ముందుకు వచ్చి నైపుణ్యాలను మెరుగుపర్చుకుని దేశ అభివృద్ధికి పాటుపడితే గాంధీజీ కలను సాకారం చేసే వాళ్లు అవుతారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచించారు.

దిశ, చేర్యాల: యువత సృజనాత్మకత శక్తితో ముందుకు వచ్చి నైపుణ్యాలను మెరుగుపర్చుకుని దేశ అభివృద్ధికి పాటుపడితే గాంధీజీ కలను సాకారం చేసే వాళ్లు అవుతారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచించారు. సోమవారం చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలతోపాటు వివిధ సంఘాల నాయకులు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని శాంతి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. శాంతి, అహింస, సమానత్వం, నీతి, నిజాయితీ వంటి సూత్రాలు ఆదర్శణీయమన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో గాంధీని మార్గదర్శకంగా తీసుకొని ప్రజలు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, పట్టణ కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు శేరి బాలనారాయణగుప్త, నాలుగు మండలాల యూత్ ఇంచార్జి శివగారి అంజయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.






