యువతి అదృశ్యం.. కేసు నమోదు

by Kodari Anjali |

జహీరాబాద్ టౌన్ పీఎస్‌లో ఓ యువతి అదృశ్యం కేసు నమోదైంది.

యువతి అదృశ్యం.. కేసు నమోదు
X

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ టౌన్ పీఎస్‌లో ఓ యువతి అదృశ్యం కేసు నమోదైంది. ఈ సంఘటనలో పట్టణంలోని నాగులకట్ట ప్రాంతానికి చెందిన తమ్మలి సంగమేశ్వర్ రెండవ కూతురు తమ్మలి రాధిక (20) అదృశ్యమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత 4వ తేదీ రాత్రి స్నేహితుల ఇంటిక వెళ్తున్నానని ఇంట్లో చెప్పి, మళ్ళి ఇంటికి తిరిగి రాకపోవడంతో కూతురి కోసం బంధువులు, స్నేహితులు తెలిసిన వారి వద్ద అన్ని చోట్ల వెతికిన ఎక్కడ కూడా ఆచూకీ తెలియలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై కే.వినయ్ కుమార్ పేర్కొన్నారు.

Next Story