- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంటలో పడి యువకుడు మృతి..
ప్రమాదవశాత్తూ గ్రామ సమీపంలో ఉన్న కుంటలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేచరేణి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

దిశ, చేర్యాల: ప్రమాదవశాత్తూ గ్రామ సమీపంలో ఉన్న కుంటలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేచరేణి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయిబాబు (30) శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దారి మార్గంలో ఉన్న కుంటలో ప్రమాదవశాత్తూ పడినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న చేర్యాల, కొమురవెల్లి పోలీసులు కుంట పరిసర ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకపోవడంతో సిద్ధిపేట జిల్లా కేంద్రం నుంచి రెస్క్యూ టీమ్ సిబ్బంది వచ్చి స్థానిక యువకుల సహాయంతో శవాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాని చేర్యాల మార్చురీకి తరలించారు. కాగా మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
విషయాన్ని తెలుసుకున్న సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ శనివారం ఉదయం వేచరేణి గ్రామంలో సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పరిశీలించారు. జరిగిన ఘటనపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారం కుటుంబానికి అందేవిగా చూస్తామని ఆయన తెలిపారు. గాలింపు చర్యలను చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్, సీఐ శ్రీను,కొమురవెల్లి ఎస్సై రాజు, ఆర్ ఐ రాజేందర్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.






