స్వచ్ఛ సిద్దిపేటలో భాగస్వాములు కావాలి

by Taduka Kalyani |

స్వచ్ఛ సిద్దిపేటలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ పిలుపునిచ్చారు.

స్వచ్ఛ సిద్దిపేటలో భాగస్వాములు కావాలి
X

దిశ, సిద్దిపేట అర్బన్ : స్వచ్ఛ సిద్దిపేటలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని ప్లాస్టిక్ దుకాణ సముదాయాల, మాంసం దుకాణాల, కిరాణా, ఫంక్షన్ హల్ యజమానులతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ... ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించి స్టీల్ బాక్స్, నారా, జూట్ బ్యాగ్ లు వాడాలని సూచించారు. నివాస సముదాయాల నుంచి వెలువడే చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలన్నారు. ప్లాస్టిక్ దుకాణ సముదాయాలు, ఫంక్షన్ హాల్స్, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణ, మాంసాహారం సముదాయాలలో నిత్యం సోదాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఏఈ. రవీందర్, సానిటరీ ఇన్ స్పెక్టర్ మహేష్, టీపీవో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story