- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొన్న తల్లిదండ్రులు... నేడు కొడుకు మృతి
తల్లిదండ్రులు లేరన్న బాధతో కొడుకు చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన సదాశివపేట పట్టణ పరిధిలో జరిగింది.

దిశ, సదాశివపేట: భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న నెపంతో కట్టుకున్న భర్త రోకలి బండతో ఆమె తలపై మోది హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటన అప్పట్లో స్థానికంగా కలకలం రేపింది. అయితే తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెంది తీవ్ర వేదనకు లోనైన కొడుకు తాజాగా ఓ చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సదాశివపేట పట్టణ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... పట్టణంలోని 7వ వార్డు సిద్దాపూర్కు చెందిన రాజు తన భార్య రాణి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గత నెల 25న అతి కిరాతకంగా రోకలి బండతో తలపై కొట్టాడు ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తాను కూడా చెట్టుకు ఉరి వేసుకున్నాడు. తాజాగా వారు కొడుకు అయిన మధు(17) పట్టణంలోని తేజ వెంచర్లలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్దిరోజులుగా తల్లిదండ్రులు లేరన్న బాధతోనే కుమిలిపోతూ మధు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటేష్ తెలిపారు.






