గొంతు ఎండుతున్నా పట్టించుకోరా..?

by Batti.Sumithra |

ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వేసవి తాపంలో కనీసం తాగడానికి నీరు లేక చాలా మంది గ్రామస్తులు అల్లాడిపోతున్నారు.

గొంతు ఎండుతున్నా పట్టించుకోరా..?
X

దిశ, సంగారెడ్డి : ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వేసవి తాపంలో కనీసం తాగడానికి నీరు లేక చాలా మంది గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎర్దనూర్, ఎర్దనూర్ తాండతో పాటు చుట్టు ప్రక్కన గ్రామాల్లో గత నెల రోజులుగా తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడి జీవిస్తున్న గ్రామస్తులకు తాగునీరు అందకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే ఈ గ్రామాలలోనే కాకుండా ఇదే మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం గ్రామాలకు తాగునీటి సరఫరా జరగడం లేదని తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల ఇక్కట్లను గమనించి తాగునీటి సరఫరాను నిరంతరం వచ్చేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story