కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి..మంజీరా నదిలో మహిళ గల్లంతు

by velandi.Saikiran |

తుక్కాపూర్ వద్ద మంజీరా నదిలో మహిళ గల్లంతైన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కొల్చారం పోలీసులు, గల్లంతైన

కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి..మంజీరా నదిలో మహిళ గల్లంతు
X

దిశ, కొల్చారం : తుక్కాపూర్ వద్ద మంజీరా నదిలో మహిళ గల్లంతైన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కొల్చారం పోలీసులు, గల్లంతైన మహిళ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన టేక్మాల్ ప్రమీల మంగళవారం సాయంత్రం సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామ సమీపంలోని మంజీరా నది తీరం వైపు వెళ్ళింది. రాత్రి వరకు ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తుక్కాపూర్ పరిసర ప్రాంతాలలో గాలించారు. ఈ తరుణంలోనే మంజీరా నది ఒడ్డున ప్రమీల నడుము బెల్టు కనిపించింది. దీంతో తహసిల్దార్ శ్రీనివాస్ చారి, ఎస్సై మొహమ్మద్ మోహినుద్దీన్ లు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రప్పించి మంజీరా నదిలో ప్రమీల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Next Story