- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, అల్లాదుర్గం: ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వస్తానని చెప్పి.. బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లి తాండకు చెందిన వడిత్య భారతి(22) మంగళవారం రోజు మధ్యాహ్న సమయంలో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి తన కూతురు హాసిని వయసు(1) ను తీసుకొని వెళ్ళింది. అయితే మధ్యాహ్నం వెళ్లిన భారతి రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో భారతి భర్త అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ మోహన్ రెడ్డి తెలిపారు.
Next Story






