- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైక్రో ఫైనాన్స్ వేధింపులతో మహిళా ఆత్మహత్య..!
దిశ, తూప్రాన్ : మైక్రో ఫైనాన్స్ వేధింపులతో ఓ మహిళా బలైన సంఘటన తూఫ్రాన్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, తూప్రాన్ : మైక్రో ఫైనాన్స్ వేధింపులతో ఓ మహిళా బలైన సంఘటన తూఫ్రాన్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి నిర్మాణం కోసం రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ తీసుకుంది వరలక్ష్మీ. దీంతో అప్పు తీర్చకపోవడంతో ఇంటికి వచ్చిఇన ఏజెంట్లు ఇష్టానుసారంగా మాట్లాడారు. దీంతో మనస్తాపానికి గురై వరలక్ష్మీ చెరువులో దూకింది. మేడ్చల్ లోని ఫైవ్ స్టార్ అనే మైక్రో ఫైనాన్స్ నుంచి రూ.4లక్షలు, తూఫ్రాన్ లోని మరో మైక్రో ఫైనాన్స్ క్రిష్ బ్యాంకు నుంచి రూ.70వేలు అప్పుగా తీసుకుంది. క్రిష్ బ్యాంకులో రూ.20వేలు చెల్లించాల్సి ఉంది. అలాగే పైవ్ స్టార్ మైక్రో ఫైనాన్స్ లో రూ.4లక్షలకు రూ.8లక్షలు చెల్లించినా ఇంకా బకాయి చెల్లించాల్సి ఉందని వేధిస్తుండటంతో ఆమె ఆత్మహత్య కి పాల్పడింది. ఆమెకు భర్త, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. వరలక్ష్మీ మృతితో వారు తీవ్ర దిగ్భాంతిలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి అక్రమ ఫైనాన్స్ లపై చర్యలు తీసుకోవాలని వరలక్ష్మీ బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






