సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, కొండపాక : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
X

దిశ, కొండపాక : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొండపాకలో సీనియర్ నాయకుడు బైరు ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ల నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో 100 మందికి పైగా సర్పంచులను గెలిపించుకుని కాంగ్రెస్ తన సత్తా చాటిందని, ఇదే ఉత్సాహంతో వచ్చే జ‌డ్పీటీసీ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని, కష్టపడే వారికి సీఎం రేవంత్ రెడ్డి గుర్తింపు ఇస్తారని భరోసా ఇచ్చారు. వచ్చే జడ్పిటిసి ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా పరిషత్ ను కైవాసం చేసుకోవడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులను సత్కరించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ని ప్రణీత్ రెడ్డి తదితరులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వాసరి లింగ రావు పాల్గొన్నారు.

Next Story