- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల సంక్షేమమే మా ప్రాధాన్యత : కలెక్టర్ ప్రావీణ్య
దిశ, సంగారెడ్డి అర్బన్ : బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ హాస్టల్స్‌ను మరింత మెరుగుపర్చడంలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ హాస్టల్స్‌ను మరింత మెరుగుపర్చడంలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. సంగారెడ్డిలోని బీసీ అభివృద్ధి కార్యాలయం ఆధ్వర్యంలో బీసీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం పట్టణం పరిధి లోని బాలురవసతిగృహం విద్యార్థులకు, హాస్టల్ గడ్డ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులకు కిర్బీ సంస్థ, సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, స్కూల్ బ్యాగులు, ట్రంక్ బాక్సులను, కలెక్టర్ పి . ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి విద్యార్థులకు అందజేశారు. జిల్లా లోని 34 బీసీ హాస్టల్ విద్యార్థులకు కిర్బీ సంస్థ సీఎస్‌ఆర్ నిధులు 29.89 లక్షల రూ. ద్వారా అందించిన స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు (3102), గ్లాసులు (3102), స్కూల్ బ్యాగులు (1681), ట్రంక్ బాక్సులు (1681) వంటి వస్తువులను కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల విద్యార్థుల కోసం నాణ్యమైన వసతులు కల్పించడం, ప్రభుత్వ బాధ్యత అయితే సమాజం, సంస్థలు బాధ్యతగా ముందుకు వస్తే విద్యార్థుల భవిష్యత్ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణంలో కావడం కోసమే కార్పొరేట్ సంస్థల సహకారంతో ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలని, మంచి మార్కులు విద్యార్థులు సాధిస్తే మరోసారి వచ్చే విద్యార్థులకు ఘనంగా సన్మానించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ప్రావిణ్య ప్రసంగం విద్యార్థుల్లో ఉత్తేజం నింపింది. అనంతరం హాస్టల్ విద్యార్థులతో కలిసి ,వారి మధ్య కూర్చొని వాళ్లతో పాటు అల్పాహారం తీసుకున్నారు. వారి వసతి, భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా విద్యార్థిలను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ అధికారి జగదీష్ ,కిర్బీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజ మహేంద్ర , హెచ్ ఆర్ నాగరాజు , వార్డెన్ గౌసుద్దీన్, సంబంధిత శాఖల అధికారులు , ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు .






