- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం : హరీష్ రావు
by Chintha Aamani |
రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.

X
దిశ, గుమ్మడిదల : రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెం.109 భూమి సమస్యపై బాధిత రైతులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావును కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రైతులకు భూ హక్కు నిరాకరించడం తగదని అన్నారు. 2013 మోక యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తానని, రైతుల వెన్నంటి నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






