- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగం మరువలేము
by Taduka Kalyani |
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాన్ని మరువలేమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు.

X
దిశ, మిరుదొడ్డి: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాన్ని మరువలేమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం అన్నారు. గురువారం మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణ ఉద్యమకారులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అమరుల త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవడంలో భాగంగా స్థూపాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. అమరుల త్యాగాల ఫలితం గానే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. పెద్దిరాజు, డా. పాపయ్య, తిరుపతిరెడ్డి, ఎం.డి. గౌస్ ఉద్దీన్, శ్రీహరి, కొండి మల్లారెడ్డి, మముద్ పాష ,లక్ష్మారెడ్డి, సుకురి ప్రవీణ్, శ్రీధర్, ఆరేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story






