గాంధీ మార్గంలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

by Bhoopathi Nagaiah |

సీఎం కేసీఆర్ గాంధీ మార్గంలో తెలంగాణ రాష్టాన్ని సాధించారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు.

గాంధీ మార్గంలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
X

దిశ, మెదక్ టౌన్: సీఎం కేసీఆర్ గాంధీ మార్గంలో తెలంగాణ రాష్టాన్ని సాధించారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నూతన గాంధీ విగ్రహాన్నిఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. మహాత్మా గాంధీకి విగ్రహాన్ని ఆవిష్కరిండం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహాత్మా గాంధీ మహోన్నత వ్యక్తి అని, ఆయన విగ్రహావిష్కరణలో తోడ్పడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

సత్యమేవ జయతే, అహింస మార్గంతో స్వాతంత్య్రాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ లాంటి వాళ్లు ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు. గాంధీ ఆశయాలకు అనుసరిస్తూ ముందుకు అందరూ సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఆర్య వైశ్య సంఘం యువజన అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి శివకుమార్, కోశాధికారి కొండ శ్రీనివాస్, మెడిశెట్టి శ్యామ్ రావు, మహిళా అధ్యక్షురాలు రాగి వనజ, కౌన్సిలర్లు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story