- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ కే.హైమావతి
దిశ, హుస్నాబాద్ : గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ

దిశ, హుస్నాబాద్ : గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ (కే. హైమావతి తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. సంబంధిత మండలాలలో ఎన్నికల ప్రచారానికి ఈ నెల 15న 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 3వ విడత ఎన్నికలు జరగనున్న హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి–దూల్మిట్ట, కొండపాక, కుకునూరుపల్లి మండలాలలోని గ్రామాలలో 15వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగనున్న జిల్లాలోని మొత్తం 9 మండలాల గ్రామాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను ఈ నెల 15న సాయంత్రం 5 గంటల నుంచి 17వ తేదీ వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






