- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి అస్తవ్యస్తం:ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
గత బీఆర్ఎస్ హాయంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

దిశ,దుబ్బాక: గత బీఆర్ఎస్ హాయంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డితో కలిసి రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం గ్రామ సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామానికి రూ.10 లక్షలు సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. హబ్షీపూర్ గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అస్క రవి, వార్డు మెంబర్లు జోగు రేఖ భార్గవ్, కోక్కడగల్ల రమేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ వజ్రవ్వ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






