అంద‌రూ స‌మాన‌త్వంతో మెలిగిన‌ప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యం : స‌ర్పంచ్ న‌రేష్

by Ratna Kumari |   (  Updated:2026-01-31 09:12:28  IST  )

జహీరాబాద్ మండలం ఆనెగుంట గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని గ్రామ సర్పంచ్ నరేష్ అధ్యక్షతన (సివిల్ రైట్స్ డే) ఘనంగా నిర్వహించారు.

అంద‌రూ స‌మాన‌త్వంతో మెలిగిన‌ప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యం : స‌ర్పంచ్ న‌రేష్
X

దిశ‌, జ‌హీరాబాద్ : జహీరాబాద్ మండలం ఆనెగుంట గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని గ్రామ సర్పంచ్ నరేష్ అధ్యక్షతన (సివిల్ రైట్స్ డే) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షకు తావులేకుండా అందరూ సమానత్వంతో మెలిగినప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఐ కాశీనాథ్, ఆర్ఐ రుక్మోద్దీన్ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా అందరూ సోదరభావంతో ఉంటూ సామాజిక ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డన్ బాల్ రాజ్ , మాజీ జడ్పీటీసీ సభ్యులు మొహియొద్దీన్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Next Story