- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి చట్టాన్ని దెబ్బతీసే వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
by Ratna Kumari |
ఉపాధి కూలీల జోలికి వస్తే మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ అన్నారు.

X
దిశ, సంగారెడ్డి అర్బన్ : ఉపాధి కూలీల జోలికి వస్తే మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ అన్నారు. గురువారం కొండాపూర్ మండలం సీతారాం తండాలో ఉపాధి కూలీలతో సీపీఎం బృందం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు రూ.600 కూలి రేటు పెంచాలని, 200 పని దినాలు కల్పించాలని అన్నారు. ఫోటో క్యాప్చర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం కొండాపూర్ మండలం కార్యదర్శి కే రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబురావు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అర్జున్ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Next Story






